భారతదేశ ప్రజలు బంగారు కొనుగోలు పై ఏ స్థాయిలో ఆసక్తిని చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూస్తే ఇండియన్స్ మాత్రం కేవలం బంగారం కొనుగోలుని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మాత్రమే కాకుండా దానిని సమాజంలో ఓ గుర్తింపు లాగా కూడా చూస్తూ ఉంటారు. దానితో భారతదేశం లో ఎక్కడ ఏ పెళ్లి జరిగిన ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని మంచి రోజులలో కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఇలా భారతీయ ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండడంతో భారతదేశంలో బంగారం ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక గత కొంత కాలంగా అనేక పరిస్థితుల కారణంగా బంగారం రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. ఇకపోతే కొంత కాలం క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులపై దాడి చేసి కొంత మంది ప్రాణాలను తీసిన విషయం మనకు తెలిసింది. దానిపై ప్రతికార చర్యగా భారతదేశం కూడా ఇప్పటికే అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను తుద మొట్టించింది. ఇక ప్రస్తుతం భారత్ - పాక్ మధ్యయుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ రోజు బంగారం ధరలు  హైదరాబాద్ నగరంలో ఏ స్థాయిలో పెరిగాయి.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు పెరిగింది. దానితో ఈ రోజు హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 99600 కు చేరింది.  22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఈ రోజు 550 రూపాయలు పెరిగింది. దానితో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఈ.రోజు 91,300 చేరింది. ఇలా ఈ.రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: