
దీరా సినిమా అనంతరం అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. తాను ఉన్న పలంగా సన్యాసం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఉన్నఫలంగా సోనియా సినిమాలకు వీడ్కోలు పలకడానికి గల కారణమేంటని అనేక రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనుంచి సినిమాలకు దూరంగా ఉండాలని సోనియా నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్టుగా వెల్లడించింది. అంతేకాకుండా ఆమె ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం నేను నన్ను నేను పరిచయం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాను. అహింస, శాంతి వంటి అంశాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. మనం ఇతరుల కోసం ఆలోచించడంలో చాలా బిజీగా ఉంటున్నాం. కానీ ఈ సమయంలో మనల్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. నా ఉనికి ఉద్దేశం గురించి నాకు తెలియదు. పర్ఫెక్ట్ గా అన్నింటిలో నేను ముందు ఉండాలనే రేసులో నన్ను నేను కోల్పోతున్నాను. ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవడం, ఎక్కువగా డబ్బులను సంపాదించడానికి ప్రయత్నాలు చేశాను. ఈరోజు నా దగ్గర డబ్బు, కీర్తి, ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి.
కానీ మనఃశాంతి మాత్రం లేదు. నాకు మనశ్శాంతి లేకపోతే డబ్బుతో నేను ఏమి చేయగలను. జీవితమంటే ఏమిటో నాకు నిజంగా తెలియాలని అనుకుంటున్నాను. సినిమా పరిశ్రమ నాకు చాలా గుర్తింపును ఇచ్చింది. కానీ ప్రశాంతతను ఇవ్వలేకపోయింది. ఇకనుంచి నేను ఎలాంటి సినిమాలలో నటించను. ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అందుకే నాకు నచ్చిన విధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నానని సోనియా బన్సాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో వెల్లడించారు. సోనియా చేసిన ఈ వాక్యాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సన్యాసం తీసుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా, సోనియాకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతోంది.