సోషల్ మీడియా అంటేనే పక్క వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియజేయడం అని రకరకాలుగా మాట్లాడుతుంటారు జనాలు . బహుశా ఈ వార్త తెలుసుకున్నాక అది నిజమే అని అనుకోక తప్పదు . మరి ముఖ్యంగా లవబుల్ జంటగా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ అనుష్క జంటలు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది . అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు ఈ కపుల్ . అంతే కాదు తమ ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా అనుష్క - విరాట్ కోహ్లీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్న రేంజ్ లో జనాలు మాట్లాడుకుంటున్నారు.


దానికి కారణం ఓ వీడియో బయటకు రావడమే. విరాట్ కోహ్లీ అనుష్క జంటలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . క్రేజీ జంటలలో ఈ జంటకు మంచి గుర్తింపు పొంది . ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా లీడ్ చేస్తున్నారు . అయితే రీసెంట్ గా అనుష్క - కోహ్లీ మధ్య గొడవలు అనేదానికి ఓ వీడియో ప్రూఫ్ గా మారింది . ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సాధారణంగా విరాట్ కోహ్లీ - అనుష్క తమ ప్రైవేట్ లైఫ్ ని ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు .



అంతేకాదు చాలా అన్యోన్యంగా ఉంటారు.  కానీ రీసెంట్గా అనుష్క మాత్రం ఫేస్ కొంచెం డల్ గా పెట్టి విరాట్ పై కోపాన్ని చూపించింది.  విరాట్ కారు దిగి అనుష్క కోసం వెయిట్ చేస్తూ ఉండగా కారు దిగడానికి అనుష్కకి సపోర్ట్ చేయగా ఆమె మాత్రం విరాట్ సహాయం తీసుకోలేదు . అంతేకాదు విరాట్ మొఖం కూడా చూడకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయింది . దీనితో విరాట్ కూసింత అసహనం వ్యక్తం చేసిన్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే ఈ వీడియో పై రకరకాలుగా జనాలు స్పందిస్తున్నారు .



కొందరు విరాట్ కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అనుష్కకి సపోర్ట్ చేస్తున్నారు . కొంతమంది మాత్రం అసలు మీకు ఇంకేం పని పాట లేదా..? వాళ్ళ లైఫ్ ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు ..? సిగ్గులేని సోషల్ మీడియా పక్క వాళ్ళ బెడ్ రూమ్లో కెమెరాలు పెట్టి ఏం జరుగుతుందో చూస్తారా..? ఇంత దారుణంగా తయారయ్యారేంటిరా బాబు అంటూ బాగానే కూసింత గట్టిగా కౌంటర్ వేస్తున్నారు . సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలకు సంబంధించిన ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది . దీనిపై త్వరగా విరాట - అనుష్క స్పందిస్తే బెటర్ లేకపోతే ఇవి ఎక్కడికి ఎక్కడికో  వెళ్లి పోతాయి అంటున్నారు ఫ్యాన్స్..!



మరింత సమాచారం తెలుసుకోండి: