గత రెండు రోజుల నుండి భారత్ - పాక్ మధ్య దాడులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే భారతీయ ఆర్మీ ఎం తోమంది పాకిస్తాన్ ఉగ్రవా దులను చంపి వేసింది . దానితో పాకిస్తాన్ వారు కూడా మనపై దాడులు చేయాలి అని ప్రయత్నించిన వారి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు . భారత్ ఆర్మీ చాకచక్యానికి ఇప్పటికే పాకిస్తాన్ కి ఎదురు దెబ్బ తగిలింది . ఇకపోతే భారత్ - పాక్ మధ్య యుద్ధం నెలకొనే అవకాశా లు ఉండడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తు తం చాలా పెద్ద ఎత్తున ఒడిదుడుకులను ఎదురుకుంటుంది . రెం డు రోజుల క్రితం భారత్ - పాకిస్తాన్ పై మొదటి దాడి చేసింది.

దానితో స్టాక్ మార్కెట్లో ఓపెన్ కాగానే పెద్ద ఎత్తున భారత స్టాక్ మార్కెట్ నష్టాలను ఎదుర్కొంటుంది అని చాలా మంది భావించారు. కానీ మొదట భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభం అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని లాభాల్లో క్లోజ్ అయింది. ఇక నిన్న భారత స్టాక్ మార్కెట్ పర్వాలేదు అనే స్థాయిలో కొనసాగింది. ఇక ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభం అయింది. భారత్ - పాక్ మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు పెద్ద ఎత్తున నెలకొవడంతో ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభం అయింది.

ఈ రోజు సెన్సెక్స్ 546 పాయింట్లు కోల్పోయి 79794 వద్ద కొనసాగుతూ ఉండగా , నిఫ్టీ 158 పాయింట్లు నష్టపోయి 24115 వద్ద ట్రేడ్ అవుతుంది. మరి ఈ రోజు పెద్ద ఎత్తున నష్టాల్లో ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే క్లోజ్ అవుతుందా లేక లాభాల్లోకి వస్తుందా అనేది తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: