ప్రస్తుతం పాకిస్తాన్ తో ఇండియా కి యుద్ధం జరుగుతున్న నేపథ్యం లో పాకిస్తాన్ కి ఇండియా కి మధ్య లింకు ఉన్న ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. అలా హీరో అజిత్ కి కూడా పాకిస్తాన్ తో సంబంధం ఉందట. మరి ఇంతకీ పాకిస్తాన్ తో ఉన్న సంబంధం ఏంటి.. తమిళ హీరో అజిత్ కి పాకిస్తాన్ తో ఉన్న ఆ లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరయిన అజిత్ ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో అజిత్ నెక్స్ట్ సినిమా పై కూడా అభిమానుల్లో క్యూరియాసిటీ ఉంది. అయితే తాజాగా అజిత్ కి పాకిస్తాన్ తో ఉన్న సంబంధం ఏంటి అనేది బయటపడింది..

ఇక అసలు విషయం లోకి వెళ్తే.. తమిళ్ హీరో అజిత్ హైదరాబాదు లోని సికింద్రాబాద్ లో జన్మించారు. ఇక అజిత్ తల్లిదండ్రులది రెండు వేరే వేరే దేశాలు. ఎందుకంటే అజిత్ తండ్రిది కేరళలోని పాలక్కడ్ అయితే .. అజిత్ తల్లిది మాత్రం అసలు ఇండియానే కాదు. అజిత్ తల్లి పాకిస్థాన్లోని కరాచీ లో పుట్టిందట. అజిత్ తల్లి పాకిస్తాన్లోని కరాచీ లో పుట్టాక వాళ్ళ ఫ్యామిలీ పాకిస్తాన్ వదిలి కలకత్తా కి వచ్చి ఇక్కడే స్థిరపడిందట.

ఇక అజిత్ తల్లి సింధు కుటుంబానికి చెందిన అమ్మాయట. అలా కలకత్తా కి వచ్చి ఇక్కడ స్థిరపడింది అజిత్ తల్లి ఫ్యామిలీ. అలా అజిత్ తల్లి కి సంబంధించిన మూలాలు పాకిస్తాన్ లో ఉండడం కారణంగా అజిత్ కి కూడా పాకిస్తాన్ తో విచిత్రమైన సంబంధం ఉంది. ఇక పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన సమయంలో చాలామంది పాకిస్తానీయులు భారతదేశంలోకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: