మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీ దత్ "జగదేక వీరుడు అతిలోక సుందరి" అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1990 సంవత్సరం మే 9 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా 1990 వ సంవత్సరం విడుదల అయ్యి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ ని ఈ సినిమా విడుదల అయిన 35 సంవత్సరాల తర్వాత అనగా 2025 మే 9 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు.

సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ హీరో అయినటువంటి చిరంజీవి , దర్శకుడు అయినటువంటి రాఘవేందర్రావు , నిర్మాత అయినటువంటి అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను వీరు ముగ్గురు తెలియజేశారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి ఒక పాయింట్ ను చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో ఈ సినిమా చివరన చిరంజీవితో శ్రీదేవి ఉండిపోవాలి అని తన చేతికి ఉన్న ఉంగరాన్ని విసిరి పారేస్తోంది. దానిలో ఒక చాప మింగేస్తుంది. మరి ఆ మింగేసిన చాప ఏమయింది ..? ఆ ఉంగరం ఏమయింది అనే ఒక పాయింట్ను పెట్టి ఆ సినిమాకు సీక్వెల్ తీసుకుంటే అద్భుతంగా ఉండేది అని చిరంజీవి చెప్పాడు.

ఇక ఆ తర్వాత ఈ ఇంటర్వ్యూ మధ్యలో రామ్ చరణ్ వీడియో కాల్ మాట్లాడాడు. అందులో రామ్ చరణ్ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చివరలో శ్రీదేవి తన వేలికి ఉన్న ఉంగరాన్ని పారేస్తోంది. అది ఒక చాప మింగేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ తో సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఇలా చిరు , చరణ్ ఇద్దరికీ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విషయంలో ఒకే రకంగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: