ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ రెమ్యూనరేషన్ గా ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిందే . ఆఫ్ కోర్స్ పబ్లిసిటీ .. పాపులారిటీ .. వాళ్ళు నటించిన సినిమాలు బాగా జనాలు ఆదరిస్తే కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న పర్వాలేదు . ఒకే ఒక సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత సినిమాలన్నీ కూడా సూపర్ తోపైన హిట్స్ అవుతాయి అన్న ధీమా వ్యక్తం చేస్తూ నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక హీరో ఏకంగా సినిమాకి 10 కోట్లు రెమ్యూనరేషన్  డిమాండ్ చేయడం నిజంగానే నిర్మాతలకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.


ఇతగాడ్ పెద్ద టాలెంటెడ్ యాక్టర్ ఏమీ కాదు.. ఏదో తనదైన స్టైల్ లో అలా అలా ఎంటర్టైన్మెంట్ అంటూ బాడిని గిరగిరా తిప్పేస్తూ  రెండు ముద్దులు నాలుగు మూడు బూతు పదాలు వాడితే జనాలు అట్రాక్ట్ అయిపోయి ఈ హీరో సినిమాని హిట్ చేశారు . అయితే ఆ తర్వాత నటించిన సినిమా కూడా హిట్ అవుతుంది అన్న ధీమాతో ఈ హీరో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేశాడు. పోనీ ఆ పది కోట్లు తీసుకున్నాడు కదా ఆ సినిమాకి అంత లాభాలు వచ్చాయా..? అంటే సీన్ అస్సలే లేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.



పెట్టిన దానికి ఒక్క రూపాయి కూడా అసలు వర్క్ అవుట్ అవ్వలేదు . మరీ ముఖ్యంగా 10 కోట్ల రేంజ్ హీరో అన్నప్పుడు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అందరూ జనాలు వచ్చి సినిమా చూడకపోయినా .. ఆయన హీరో ఫ్యాన్స్ అయినా వచ్చి  సినిమా చూస్తారు . కానీ ఈ హీరో నటించిన సినిమాకు కేవలం నాలుగు అంటే నాలుగు లక్షల మాత్రమే టోటల్గా ఒక ఏరియాలో కలెక్షన్స్ రావడం పరువు తీసేసిట్లైంది. 10 కోట్ల రెమ్యూనరేషన్  తీసుకునే హీరోకు ఒక ఏరియాలో టోటల్ 4 లక్షల మాత్రమే వచ్చాయి అంటే అది ఎంత సిగ్గుచేటో  అర్థం చేసుకోవచ్చు . తప్పు హీరోలది కానే కాదు . వాళ్లకేముంది ఎన్నైనా అడుగుతారు.. నిర్మాతలదే బాధ్యత అంత.  నిర్మాతలు ఆ హీరోకి అంత ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించి సినిమాలో హీరోగా తీసుకోవాలి. హీరోలు ఎంత ఇచ్చిన పుచ్చుకుంటారు . ఎటు వచ్చి బొక్క మొత్తం నిర్మాతలకి.  ఈ హీరోకి ఏం పోతుంది.  ఇంకో సినిమా హిట్ అయితే మరో నలుగురు ఐదుగురు  ప్రొడ్యూసర్లు బలి అవ్వాల్సిందే.  ప్రజెంట్ ఈ హీరోని దారుణతి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: