కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు కాకపోయినా , ఈయన ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించకపోయినా దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా లోకేష్ కనకరాజు , తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు తాజాగా ఓ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో ఓ మూవీ ని కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ హీరోలుగా లోకేష్ కనకరాజు ఓ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించాలి అని అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈ ఇద్దరు హీరోలను కలిసి ఓ కథను కూడా వివరించగా వీరిద్దరు కూడా లోకేష్ చెప్పిన కథకు బాగా ఇంప్రేస్ అయ్యి ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోలుగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ నిజం గానే రజిని , కమల్ , లోకేష్ కాంబోలో మూవీ కనుక రూపొందినట్లయితే ఆ మూవీ పై అంచనాలు తార స్థాయిలో ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పటికే కమల్ , లోకేష్ కాంబోలో విక్రమ్ అనే సినిమా రూపొంది అద్భుతమైన విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk