కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. లోకేష్ కనకరాజు ఆఖరుగా తలపతి విజయ్ హీరో గా త్రిష హీరోయిన్ గా రూపొందిన లియో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజు , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందుతున్న కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే లోకేష్ ఇప్పటికే తన నెక్స్ట్ 5 మూవీలను సెట్ చేసి పెట్టుకున్నాడు. మరి లోకేష్ నెక్స్ట్ ఐదు మూవీ లు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం రజనీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న లోకేష్మూవీ పూర్తి కాగానే ఖైదీ మూవీ కి కొనసాగింపుగా కార్తీ హీరో గా ఖైదీ 2 మూవీ ని రూపొందించబోతున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే విక్రమ్ మూవీ కి కొనసాగింపుగా విక్రమ్ 2 అనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీ పూర్తి కాగానే లియో మూవీ కి కొనసాగింపుగా లియో 2 అనే సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఇక ఆ తర్వాత రోలెక్స్ అనే సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ , రజినీ కాంత్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా లోకేష్ ఇప్పటికే ఏకంగా తన నెక్స్ట్ 5 మూవీలను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk