పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. బండ్ల గణేష్మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను 2012 వ సంవత్సరం మే 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 13 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ సమయంలో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి ... ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 19.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 9.30 కోట్లు , ఉత్తరాంధ్రలో 5.50 కోట్లు , ఈస్ట్ లో 3.75 కోట్లు , వెస్ట్ లో 3.43 కోట్లు , గుంటూరు లో 4.35 కోట్లు , కృష్ణ లో 3.18 కోట్లు , నెల్లూరు లో 2.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 51.06 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.80 కోట్లు , ఓవర్సీస్ లో 4.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 60.16 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 37.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 60.16 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ కి 22.56 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk