మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోహన్ లాల్ ఎన్నో మలయాళ సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మోహన్ లాల్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో ఎన్నో సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను కూడా అందుకున్నాయి. కొంత కాలం క్రితం మోహన్ లాల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా సమంత నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ సినిమా ద్వారా మోహన్ లాల్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే కొంత కాలం క్రితం మోహన్ లాల్ "L2 ఎంపురన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా మోహన్ లాల్ హీరోగా రూపొందిన తుడురం అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఇప్పటివరకు 200 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఈ సినిమా మరికొన్ని రోజుల పాటు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: