
ఈ వీడియోలో నితిన్ జయ్ పాత్రలో చూపించారు. అలాగే సీనియర్ హీరోయిన్ లయని కూడా ఒక పోలీస్ అధికారి పాత్రలో చూపించారు. వీరితో పాటుగా హీరోయిన్ సప్తమి గౌడ, సౌరబ్ సచిదేవ్, వర్ష బోలమ్మ వంటి పాత్రలను కూడా ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా తమ్ముడు చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ హైలెట్గా కాబోతోంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలలోకి రియంట్రి ఇవ్వబోతున్నది. ప్రస్తుతం తమ్ముడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
నితిన్ రీసెంట్గా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో వరుస అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఎలాగైనా తమ్ముడు సినిమాతో హిట్టు కొట్టాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించారు. అప్పుడు సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తీసుకొని నితిన్ తో తమ్ముడు సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం మూడ్ ఆఫ్ తమ్ముడు అనే వీడియోని రిలీజ్ చేయడంతో అందరిని ఆకట్టుకుంటోంది. అభిమానులకు మాత్రం ఈ వీడియో తెగ నచ్చేయడంతో సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నితిన్ ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.