డ్రాగన్ బ్యూటీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కాయాదు లోహర్ మాత్రమే.. ఈ హీరోయిన్ తెలుగులో శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం డ్రాగన్ మాత్రమే.. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా కాయాదు లోహర్ నటించింది.ఈ సినిమా ద్వారా కాయాదు లోహర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయిన కాయాదు లోహర్ చేతిలో దాదాపు అర డజను సినిమాలు ఉన్నాయట. ఇక యంగ్ సెన్సేషన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ విడాకులు తీసుకున్న హీరోతో బట్టలు లేకుండా బాత్ టబ్ లో కూర్చుని సంచలనం సృష్టిస్తోంది.మరి ఇంతకీ ఆ విడాకులు తీసుకున్న హీరో ఎవరయ్యా అంటే నటుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్.. జీవి ప్రకాష్ గత ఏడాది తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 

విడాకుల తర్వాత జీవి ప్రకాష్ పై ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఆ రూమర్లన్నింటిని పక్కన పెడితే తాజాగా జీవి ప్రకాష్ తో కలిసి బట్టలు లేకుండా ఒకే బాత్ టబ్ లో కూర్చుంది కాయాదు లోహర్..అయితే అలా ఎందుకు కూర్చుంటుంది.. వీరిద్దరి మధ్య ఏదైనా సంథింగ్ సంథింగ్ ఉందా అని కొంతమంది అనుకోవచ్చు.కానీ అలాంటిదేమీ లేదు వీరిద్దరూ తమ కొత్త సినిమా కోసం అలా కూర్చున్నారు. బాత్ టబ్ లో బట్టలు లేకుండా అటు జీవి ప్రకాష్ పాటు ఇటు కాయాదు లోహర్ ఇద్దరూ వైన్ తాగుతూ కూర్చున్న పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.అయితే జీవి ప్రకాష్ కాయాదు లోహర్ నటిస్తున్న తాజా మూవీ ఇమ్మెర్టల్.

 అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాత్ టబ్ లో కాయాదు లోహర్ బట్టలు లేకుండా కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టరే ఇలా ఉంది అంటే సినిమా ఇంకెలా ఉంటుందో అని సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం యూత్ ఎక్కువగా ఇలాంటి సినిమాలకే మొగ్గు చూపుతున్నారు కాబట్టి దర్శకులు కూడా యూత్ పల్స్ పట్టి  సినిమాల్లో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు,ఇంటిమేట్ సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: