
వార్2, డ్రాగన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వార్2 ఈ ఏడాది రిలీజ్ కానుండగా డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది. ఈ సినిమాలు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. దేవర సినిమా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే టాక్ పాజిటివ్ గా వస్తే యంగ్ టైగర్ భవిష్యత్తు సినిమాలు సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. తారక్ తన రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తన సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో తారక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటె బాగుంటుందని చెప్పవచ్చు. తన సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్న తారక్ కు తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలలో పాన్ ఇండియా హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.