
చిన్నచిన్న విషయాల్లో బాలయ్య, బోయపాటి శ్రీను మధ్య మనస్పర్ధలు వచ్చాయని భోగట్టా. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబో అవుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. అఖండ2 సినిమా ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు.
అందువల్ల ఈ సినిమా చెప్పిన సమయానికి విడుదలవుతుందో లేదో అనే చర్చ జరుగుతోంది. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నరు. బాలయ్య రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల రేంజ్ కు చేరగా ఈ హీరో రాబోయే రోజుల్లో కలెక్షన్ల విషయంలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది.
స్టార్ హీరో బాలయ్య పుట్టినరోజుకు సైతం కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య వయస్సుకు మించి కష్టపడుతూ తన సినిమాలు సక్సెస్ కావడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఎంపిక చేసుకునే పాత్రల్లో వైవిధ్యం చూపిస్తుండటం ఈ స్టార్ హీరోకు ఎంతగానో ప్లస్ అవుతోంది. బాలయ్య ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.