బాలయ్య కు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అలా బాలయ్య కు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ , గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు రాగా , అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. మరో రెండు సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లుగా నిలచాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి బాలకృష్ణ , గోపాల్ కాంబోలో వచ్చిన సినిమాలు ఏవి ..? వాటి రిజల్ట్స్ ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ , గోపాల్ కాంబోలో మొదటగా లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రావడానికి కాస్త సమయం పట్టింది. వీరి కాంబోలో మూడవ సినిమాగా సమర సింహా రెడ్డి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో నాలుగవ సినిమాగా నరసింహ నాయుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మొత్తం వీరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా రెండు ఇండస్ట్రీ హిట్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: