- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా కు సంబంధించి రీసెంట్ గానే అధికార ప్రకటన కూడా చేయడం తో ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుంద ని అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అలాగే ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ టబు కూడా ఓ కీలక పాత్ర లో నటించబోతుంది .. ఆమె మాత్రమే కాకుండా కన్నడ నటుడు దునియా విజయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధిక ఆఫ్టే కూడా నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ..


అయితే ఇప్పుడు ఈ సినిమా లో మరో క్రేజీ బ్యూటీ కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ క్రేజ్ సంపాదించుకున్న నిహారిక ఎన్ఎం రీసెంట్ గా పేరాసు అనే సినిమా లో నటించింది .. అడల్ట్ కంటెంట్ స్టోరీ అయినప్పటి కీ చాలా సున్నితం గా ఈ సినిమా తెరకెక్కింది .. ఇక దాంతో ఈ మూవీ ప్రేక్షకుల ను ఎంత గానో ఆకట్టుకుంది .. అయితే ఎప్పుడు పూరి జగన్నాథ్ తన సినిమా లో నిహారిక ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది .. అయితే నిహారికసినిమా లో ఎలాంటి పాత్ర లో నటించబోతుంద నే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరిగింది .. అలాగే ఈ సినిమా ను పూరి తన సొంత బ్యానర్ అయ‌న పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి తో కలిసి నిర్మించబోతున్న విషయం తెలిసిందే .. ఇక మరి ఈ సినిమా తో అయినా ఈ డేరింగ్ డైరెక్టర్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి ..




మరింత సమాచారం తెలుసుకోండి: