గతంలో మన సౌత్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఫ్రాంచైజీ సినిమాలు పెద్దగా తెరకెక్కేవి కావు.. బాలీవుడ్  ఎప్పటినుంచో వీటిలో ముందు ఉన్నప్పటికీ .  ఇక మన సౌత్‌ సినిమాలకు మాత్రం అవి పెద్దగా కలిసి రాకపోవడం వల్ల వీటి మీద పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు .  కానీ రాజమౌళి బాహుబలి రెండు భాగాలు తీసి భారీ విజయం అందుకోవటంతో మరోసారి ఈ ట్రెండ్ ఊపందుకుంది .. ఒకే స్టోరీ ను రెండు భాగాలుగా తీయడం,  ఒక కథకు మళ్ళీ సీక్వెల్ చేయటం ఒక క్యారెక్టర్ లేదా కాన్సెప్ట్ ను ఫ్రాంఛైజీగా  మార్చటం ప్రజెంట్ ట్రెండ్గా మారింది .  అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ను బాగా వాడుకుంటున్నాడు కోలీవుడ్ హీరో కార్తీ .  వరుస విజయాల తో దూసుకుపోతున్నాడు .


ప్రెసెంట్ సౌత్ లో అత్యధిక సిక్వెల్స్ ఫ్రాంచైజీ సినిమాలు చేస్తున్న హీరో కూడా ఇతనే అని చెప్పాలి  .. కార్తీ ఇప్పటికే తన సూపర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే .  ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానంది .. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక ఇప్పుడు తాజాగా తెలుగు మూవీ హిట్ 3 క్లైమాక్స్ లో కూడా కార్తీ మెరిశాడు .. ‘హిట్-4’లో అతనే హీరో అనే విషయం కూడా కన్ఫర్మ్ అయింది .  ఈ సినిమాలో కార్తీక్ వీరప్పన్ అనే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ..



ఈ క్ర‌మంలోనే కార్తి చేయబోయే మరో సీక్వెల్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు .. అదే ఖైదీ 2 .. ఖైదీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ ఎప్పటినుంచో ఈ సినిమా సీక్వల్ గురించి చెబుతూ వస్తున్నాడు .. ఇప్పుడే కూలీ త‌ర్వాత‌ తన నెక్స్ట్ మూవీ అదే అని మరోసారి కన్ఫర్మ్ చేశాడు .  అలాగే మరో పక్క కార్తీక్ కెరియర్ లో చాలా స్పెషల్ ‘ఖాకీ’  ఈ సినిమాకి కూడా సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం దళపతి విజయ్ తో  ‘జననాయగన్’ చేస్తున్న  హెచ్.వినోద్ .. తర్వాత ఖాకీ 2 చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది .. అలాగే మరోవైపు సూర్య కంగువ క్లైమాక్స్లో కార్తీ  పాత్రను ప్రవేశపెట్టి దాని సీక్వల్ గురించి కూడా ప్రకటించారు .. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావటంతో దానికి బ్రేక్ పడినట్టు అయింది .. ఇలా మన సౌత్ లోనే వరుస విజయాలు అందుకుంటూ వరుస క్రేజీ సీక్వెల్స్ తో దూసుకుపోతున్నాడు కార్తీ..

మరింత సమాచారం తెలుసుకోండి: