సినిమా షూటింగ్ పూర్తి చేయడమంటే అంత  ఈజీ టాస్క్ కాదు.. ఎంతోమంది కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి కాదు.. ముఖ్యంగా ఎండ, వాన అని తేడా లేకుండా సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు చాలా కష్టపడుతూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని సంవత్సరాలు దాటినా కూడా సినిమా షూటింగ్ పూర్తి చేయలేరు. మరి కొంతమంది కొన్ని నెలలలోనే సినిమాలు పూర్తి చేసి విడుదల చేస్తూ ఉంటారు. బాహుబలి వంటి సినిమాలు పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టినప్పటికీ.. ఇప్పుడు ఆ సినిమా రికార్డును తిరగ రాస్తే ఏకంగా 14 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఒక సినిమా ఉన్నదట. అయితే ఆ సినిమా ఏంటి? మరి సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం.


సినిమా ఏదో కాదు" మొఘల్ ఏ ఆజం" ఈ సినిమా బాలీవుడ్లో తెరకెక్కించారు. 1944లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి 1960లో పూర్తి చేశారట. డైరెక్టర్ కె ఆసిఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా కోసం ఈ డైరెక్టర్ చాలా కష్టపడ్డాడట. అప్పట్లోనే ఈ సినిమా బడ్జెట్ 1.5 కోట్ల రూపాయలతో తీశారు. ఇందులో హీరోగా దిలీప్ కుమార్ నటించారు. మొదట ఈ చిత్రంలో ఈ హీరో నటించడానికి ఇష్టపడలేదట.


కానీ డైరెక్టర్ బలవంతం చేయడంతో ఈ సినిమాలో నటించారని సమాచారం. మధుబాల ఈ చిత్రంలో నటించినది. అలాగే మరి కొంతమంది నటీనటులు కూడా నటించారు.ఈ చిత్రంలోని పాట ప్యార్ కియా తో డర్నా క్యా సాంగ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. అప్పట్లో ఈ పాటని పూర్తి చేయడానికి 10 లక్షల రూపాయల వరకు ఖర్చయిందట. 1960 ఆగస్టు 5న విడుదలైన మొఘల్- ఏ- ఆజం సినిమా ఒక సంచలనాలను సృష్టించి ఏకంగా రూ .10 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టిందట.అంతే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: