
రీసెంట్ గానే చావాలో ఔరంగజేబ్ పాత్రని పోషించిన అక్షయ్ .. ఆ పాత్రలో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు .. అక్షయ్ ఖన్నా కెరియర్ లో ఇది ఓ గొప్ప మైలురాయి లాంటి పాత్ర . ఇక ఈ సినిమా తర్వాత అక్షయ్ కు చాలా ఆఫర్లు వచ్చాయి కానీ ‘మహాకాళి’లో పాత్ర ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది .. అయితే ఈ సినిమాలో మహాకాళిగా ఎవరు కనిపిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది .. ఈ క్యారెక్టర్ కు ఓ స్టార్ హీరోయిన్ కావాలి ప్రశాంత్ వర్మ కూడా కొంతమందిని సంప్రదించాడు .. అయితే ఆ చర్చలు కొలిక్కి రాలేదు .
అనుపమ , రష్మిక లాంటి పేర్లు గట్టిగా వినిపించాయి ఈ పాత్ర ఎవరు చేసినా బల్క్ డేట్లు కావాలి .. అలా ఇచ్చేవాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు .. స్టార్ హీరోయిన్ దొరక్కపోతే రెండు మూడు సినిమాలు అనుభవం ఉన్న హీరోయిన్ తో అయినా సర్దుకు పోదామని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు .. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ మహాకాళి కూడా ఒక భాగమే అయినా ఇదివరకు తీసిన `హనుమాన్`తో పాటుగా చెయ్యబోయే `అధీర`లోని పాత్రలు కూడా ఈ యూనివర్స్ లో కలుస్తాయి .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి ..