
2020 సంవత్సరంలో నటిగా మీనాక్షి చౌదరి కెరీర్ మొదలు కాగా హిట్2 సినిమా సక్సెస్ ఆమె కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు. హిట్2 సినిమాతో మీనాక్షి చౌదరి తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. తమిళంలో మీనాక్షి చౌదరి పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐపీఎల్ లో నచ్చిన జట్టు ఏదనే ప్రశ్నకు మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖలు చేశారు.
తనకు ప్రత్యేకంగా నచ్చిన జట్లు ఏవీ లేవని ఆమె పేర్కొన్నారు. అయితే క్రికెటర్లలో మాత్రం ధోని అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు. ధోని ఏ టీంలో ఉంటే నాకు ఆ టీం నచ్చుతుందని మీనాక్షి చౌదరి కామెంట్లు చేయడం గమనార్హం. మీనాక్షి చౌదరి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. మీనాక్షి కెరీర్ ప్లన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.
సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని పెంచుకున్నారు. ఒకవైపు యంగ్ హీరోలకు, మరోవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ మీనాక్షి చూదరి పాపులారిటీని పెంచుకుంటున్నారు. మీనాక్షి చౌదరి లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. మీనాక్షి చౌదరిని అభిమానించే ఫ్యాన్స్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.హీరోయిన్ మీనాక్షి చౌదరి రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది.