జయం రవి లవర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ మాత్రమే. అయితే ఆ మధ్యకాలంలో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నాను అంటూ ప్రకటించిన సమయంలో కెనిషా వల్లే ఇదంతా జరిగింది అని వార్తలు వినిపించాయి.ఆ టైంలో కెనీషా స్పందిస్తూ.. రవి నా క్లయింట్ మాత్రమేనని,మా ఇద్దరి మధ్య ప్రేమ, ఎఫైర్, రిలేషన్ ఏదీ లేదని, మేమిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ కొట్టి పారేసింది.కానీ సడన్గా కేనీషా జయం రవి ఇద్దరు కలిసి ఇషారి కే గణేష్ కూతురు పెళ్లిలో కనిపించడంతో చాలామంది షాక్ అయిపోయారు. ఇదేంటి ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పి మళ్ళీ ఇలా భార్యాభర్తల్లా తిరుగుతున్నారు అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. అయితే ఈ ఫోటో నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోపై స్పందించింది జయం రవి భార్య ఆర్తి. 

ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో తన బాధను అంతా వెళ్లగక్కుతూ ఒక పెద్ద పోస్ట్ చేసింది.అంతేకాదు విడాకులు ఇవ్వక ముందే తన పిల్లల్ని కనీసం పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు చేసింది. అంతేకాదు డివోర్స్ వచ్చే వరకు కూడా నేను జయం రవి భార్యనే.. నా ఇన్స్టా ఐడి ఆర్తి రవి అనే ఉంటుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈమె చేసిన పోస్ట్ పై జయం రవి లవర్ కెనీషా స్పందిస్తూ ఒక మగాడు ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతంగా ఉంటాడో ఆ మహిళకే మనసు ఇస్తాడు.. అంటూ పరోక్షంగా జయం రవి ఆర్తి ల గురించి పోస్ట్ చేసింది. అయితే ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట్లో దుమారం సృష్టించడంతో చాలామంది సెలబ్రిటీలు ఆర్తికి మద్దతుగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 ఇందులో సీనియర్ నటిమణులు కుష్బూ,రాధికలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఆర్తికి సపోర్ట్ చేయడంతో సింగర్ కెనీషా పరోక్షంగా వీరిద్దరికి మూసుకొని కూర్చోండి అన్నట్లుగా కౌంటర్ ఇచ్చింది.తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. కొంతమంది సొంత విషయాలని వదిలేసి బయటి విషయాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఏదైనా మాట్లాడాలంటే నాతో స్వయంగా మాట్లాడాలి.ఇలా పిఆర్ఓ లను పెట్టుకోకూడదు. ఇలా నా గురించి మాట్లాడే వారు ఎవరైనా ఉంటే నా ముందుకు రండి..లేకపోతే మూసుకొని కూర్చోండి అన్నట్లుగా పరోక్షంగా కుష్బూ, రాధికలకు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం కెనీషా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది కుష్బూ,రాధిక లకే కౌంటర్ ఇచ్చింది అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: