
సాధారణ వ్యక్తులకు, స్టాంగ్ వ్యక్తులకు మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన తెలిపారు. స్ట్రాంగ్ పీపుల్ ను పరిశీలిస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చని ఆయన కామెంట్లు చేశారు. వాళ్లు ఏ కారణం చేతనైనా బాధకు గురైతే గట్టిగా ఏడవరని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. అన్యాయం జరిగిందని అడగరని చెప్పుకొచ్చారు. ఎవరితోనూ యుద్ధం చేయరని జరిగిన దానికి ఎవరికీ ఏ సమాధానం చెప్పరని ఆయన చెప్పుకొచ్చారు.
జరిగిన దానికి ఎవరికీ సమాధానం చెప్పరని ఫిర్యాదు చేయరని వివరణలు ఇచ్చుకోరని కామెంట్లు చేశారు. వీళ్లు ఎక్కువ డ్రామా చేయరని ఎవరి అటెన్షన్ కోసం ఎదురు చూడరని ఎవరి మీద ఎలాంటి ద్వేషం, కోపం పెట్టుకోరని ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో అస్సలు ఉండరని కామెంట్లు చేశారు. వీళ్లు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లిపోతారని ఆయన వెల్లడించారు.
కొంతకాలం పాటు అందరికీ దూరంగా బ్రతుకుతారని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. వీళ్లకు ఇది వరకు ఉన్న నమ్మకం మనుషులపై ఉండదని పరిచయాలు తగ్గిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. వీళ్లు వారి కష్టాన్ని ఎవరితో పంచుకోరని అందరితో ఎప్పట్లాగే సరదాగా ఉంటారని ఎవడో అన్యాయం చేశాడని ఇంకొకరికి అన్యాయం చేయరని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనస్సు లోపల అన్నీ దాచుకుని ముందుకు వెళ్లాలి. బాధ పడిన ప్రతిసారి ఒంటరిగా కూర్చోవాలి. అప్పుడే గాయాలన్నీ మానుతాయి. వెన్నుపోటు తర్వాత అనవసరమైన వ్యక్తుల కోసం శక్తిని వృథా చేయకూడదు. మళ్లీ స్నేహం చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి అని ఆయన తెలిపారు.