టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో సినిమా తాజాగా లాంఛనంగా మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొని జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ కు తమ ఆశీస్సులు అందజేశారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ ఎన్టీఅర్ పెద్ద కొడుకు నందమూరి మోహనకృష్ణ గతంలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య సినిమాలకు ఆయన ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. చండ శాసనుడు సినిమాతో ఆయన కెరీర్ మొదలు కాగా చివరిగా 2000 సంవత్సరంలో విడుదలైన గొప్పింటి అల్లుడు సినిమాకు ఆయన పని చేశారు.
 
గొప్పింటి అల్లుడు సినిమ రిలీజ్ తర్వాత తాను కెమెరా ముట్టుకోనని మోహన కృష్ణ ఒట్టు వేసుకోగా మనవడిపై ఉన్న ప్రేమతో ఆ ప్రామిస్ ను బ్రేక్ చేశారు. సినిమా లాంఛ్ లో ఫస్ట్ షాట్ కు గౌరవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించి వార్తల్లో నిలిచారు. మనవడిపై అభిమానంతో ఆయన చేసిన పనికి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. 25 సంవత్సరాల క్రితం ప్రామిస్ ను బ్రేక్ చేయడం సులువైన విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు.
 
మరోవైపు వైవీఎస్ చౌదరికి సైతం నందమూరి కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం అనే సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక్ తో చేసే సినిమాతో వైవీఎస్ చౌదరి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నందమూరి నాలుగో తరం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించి నందమూరి ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: