తెలుగు సినీ పరిశ్రమకు , రాజకీయ పార్టీలకు మంచి అనుబంధం ఉన్నది.చాలామంది సెలబ్రిటీలు కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. మరి కొంతమంది ఇప్పటికీ రాజకీయాలలో కొనసాగుతూ ఉన్నారు. అలా ప్రతిసారి ఎన్నికలు జరిగేటప్పుడు కొంతమంది కొన్ని పార్టీలకు మద్దతు ఇస్తూ ఉంటారు. ప్రముఖ నటుడుగా  పేరుపొందిన శివాజీ రాజా కూడా బిజెపి పార్టీలో ఉన్నారు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన శివాజీ రాజా ప్రస్తుతం అడపా దడపా చిత్రాలలో నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన పొలిటికల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు శివాజీ రాజా.


శివాజీ రాజా మాట్లాడుతూ తన పొలిటికల్ ఫేవరెట్ లీడర్ నాయకుడు వెంకయ్య నాయుడు గారు అని.. ఆయన  ఇల్లు కూడా మా ఇంటి పక్కనే ఉండేదని చాలా చక్కగా మాట్లాడిస్తారు.. ఎక్కడ కనపడినా కూడా మంచితనంగానే మాట్లాడిస్తారని.. కిషన్ రెడ్డి కూడా తనకు మంచి స్నేహితుడని.. అలా తనకు చాలామంది శివాజీ రాజా. గతంలో కృష్ణంరాజు గారు బిజెపిలో ఎంపీగా ఉన్నప్పుడు తనని కూడా బిజెపి పార్టీలో జాయిన్ చేశారని.. అప్పటినుంచి ఇప్పటివరకు తాను బిజెపి పార్టీలో ఉన్నానని తెలిపారు.


ఇతర పార్టీలో చేరేందుకు అవకాశాలు వచ్చినా కూడా తాను వెళ్లలేదని ఒకసారి మాట అనుకున్న తర్వాత అక్కడే అయినా ఉండిపోతాను కానీ మారేది ఉండదంటూ  తెలిపారు. మోడీ గారు అంటే తనకు చాలా ఇష్టమని అన్ని పార్టీలలో నాయకులు తనకి తెలిసిన వారు కూడా ఉన్నారని తెలిపారు శివాజీ రాజా. మొత్తానికి శివాజీ రాజా పొలిటికల్ ఎంట్రీ వెనుక దివంగత నటుడు కృష్ణంరాజు హస్తము ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో శివాజీ రాజా సినిమాలలో  ఎక్కువగా కనిపించలేదు అనే ప్రశ్నకు.. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తానని.. అది చిన్నదా పెద్దదా అని చూడనని తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో అలా పాత్రలు మెప్పించినవి ఏవి లేవని కూడా తెలిపారు శివాజీ రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: