
నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అవేటేడ్ పాన్ ఇండియా సిక్వెల్ అఖండ 2 అందరికీ తెలిసిందే .. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ , లెజెండ్ , అఖండ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాలు అందుకున్నాయి .. ముఖ్యంగా అఖండ సినిమా బాలయ్యకు తిరుగులేని సక్సెస్ ఇచ్చి టాలీవుడ్ కే మొగుడిగా మార్చింది .. ఇప్పుడు అలాంటి సినిమా కి సిక్కుల్ అంటే అంచనాలు ఊహించని రేంజ్ లో ఉంటాయి ..
బాలయ్య కూడా వరుస విజయాల తో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ నాలుగు విజయాలు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు అఖండ 2 తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో ఒక స్పెషల్ ఎలిమెంట్ కోసం చర్చ గట్టిగా నడుస్తుంది .. మామూలుగా బాలయ్య , బోయపాటి సినిమాల్లో ఆయుధాలు అంటే ఎంతో స్పెషల్ క్రేజ్ ఉంటుంది ..
ఇక డిఫరెంట్ స్టైల్లో ఆయుధాలు వీరి సినిమాల్లో దర్శనం ఇచ్చి హైలెట్ అవుతూ ఉంటాయి .. ఇక మరి ఇలా అఖండ పార్ట్ 1న్ లో కూడా బాలయ్య అఘోర గెటప్లో చేతపెట్టిన త్రిశూలం కూడా ఎంతో కొత్తగా కనిపిస్తుంది .. అయితే ఇప్పుడు మరి దానికి అడ్వాన్స్ వేర్షన్ని బాలయ్య కోసం బోయపాటి స్పెషల్గా డిజైన్ చేయించినట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది .. ఇక అది చూడడానికి మరింత డిఫరెంట్ గా అదే విధంగా మైథాలజీ టచ్ తో కూడా ఉంటుందట .. ఇక మరి అఖండ 2 లో బాలయ్య ఏ విధంగా దర్శనమిచ్చి ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తారో చూడాలి ..