తమిళ సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగిబ్నటులలో ఆర్య ఒకరు . ఈ యన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయా ల ను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మం చి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరో గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన వరుడు అనే సినిమా లో విలన్ పాత్రలో నటించా డు . భారీ అంచనాల నడుమ విడుదల అయి న ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయి నా ఈ సినిమాలో తన నటనతో ఆర్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

దానితో ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆర్య కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. కొంత కాలం క్రితం ఆర్య , పా రంజిత్ దర్శకత్వంలో సర్పట్ట పరంపర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే ఆర్య హీరోగా పా రంజిత్ సర్పట్టా పరంపర మూవీ కి సీక్వెల్ ను రూపొందించబోతున్నాడు. ఇక ప్రస్తుతం పా రంజిత్ సర్పట్ట పరంపర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు ,  మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: