హిందీ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ నటులలో అమీర్ ఖాన్ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు . అలాగే ఈయన నటించిన సినిమాలు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అమీర్ ఖాన్ కి అదిరిపోయే రేంజ్ విజయాలను అందించిన దర్శకులలో రాజ్ కుమార్ హీరాని ఒకరు.

ఆమీర్ ఖాన్ రాజ్ కుమార్ హీరాని కాంబోలో మొదటగా 3 ఇడియట్స్ అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా అమీర్ క్రేజ్ మరింతగా పెరగగా ... రాజ్ కుమార్ హిరానీ దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో పీకే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరికొన్ని రోజుల్లో మరో మూవీ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ కోసం రాజ్ కుమార్ హీరాని ఓ కథను తయారు చేస్తున్నట్లు , అది పూర్తి అయ్యాక దానిని రాజ్ కుమార్ హిరానీ , అమీర్ కి వినిపించనున్నట్లు , ఆమీర్ కి ఆ కథ నచ్చినట్లయితే వీరిద్దరి కాంబోలో మరో మూవీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది.

వీరిద్దరి కాంబో లో కనుక మరో మూవీ సెట్ అయితే దానిపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: