పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఇమ్రాన్ హష్మీ , శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా .. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు ఫుల్ స్పీడ్ గా జరిగింది.

దానితో ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేశారు. అది అద్భుతంగా ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమా పై ప్రేక్షకులు అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి. ఇక ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో బిజీ కావడం వల్ల ఈ మూవీ షూటింగ్ చాలా కాలం పాటు ఆగిపోయింది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. దానితో ఈ మూవీ షూటింగ్ తిరిగి మళ్ళీ ప్రారంభం అయింది.

ఇది ఇలా ఉంటే తాజా గా ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న శ్రేయ రెడ్డి సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఓజి మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కావడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఓజి మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sr