టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలిగిన స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు . పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని మొదలు పెట్టిన తర్వాత కొంత కాలం పాటు ఈ సినిమా షూటింగ్ సజావు గానే జరిగింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్సినిమా షూటింగ్ కాస్త ఆపేసి మరికొన్ని సినిమాలను స్టార్ట్ చేశాడు. దానితో ఈ మూవీ షూటింగ్ స్లో అయింది. ఈ సినిమా షూటింగ్ పెండింగ్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు దగ్గరకు రావడంతో పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టాడు.

దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా పలుమార్లు ఆగిపోయి స్టార్ట్ కావడం వల్ల క్రిష్ కూడా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి తప్పుకున్నాడు. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ యొక్క విడుదల తేదీని తాజాగా ఈ మూవీ బృందం వారు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జూన్ 13 వ తేదీన విడుదల చేయాలి అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk