టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో మహేష్ బాబు ఎటువంటి కాంట్రవర్షియల్ మేటర్ లో తల దూర్చడు . అసలు కాంట్రవర్షియల్ అన్న పదానికి ఆమడ దూరంలో ఉంటాడు మహేష్ బాబు . తన పని తాను చూసుకునిపోవడం. ఇచ్చిన కాల్ షీట్స్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని తన సినిమా షెడ్యూల్స్ పక్క ప్లాన్ తో ముందుకు తీసుకెళ్లడం . టైం దొరికితే ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడం . ఇలాగే చేస్తూ ఉంటాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఓ హీరోయిన్ తో దాదాపు 19 ఏళ్ల నుంచి మాట్లాడడం లేదు అన్న వార్త మరొకసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సౌత్ ఇండియా క్రెజియెస్ట్ హీరోయిన్ నయనతార .


ఎస్ నయనతారతో మహేష్ బాబు ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.  కానీ వీళ్ళ కాంబోలో చాలా సినిమాలను ప్లాన్ చేశారు మేకర్స్.  కానీ మహేష్ బాబుని ఏకంగా మూడుసార్లు తన సినిమాలో హీరోయిన్గా నయనతార వద్దు అంటూ రిజెక్ట్ చేశారట.  అసలు మొదటిగా వీళ్ళకాంబోలో రావాల్సిన సినిమా పోకిరి . పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్లాస్ట్ చేసింది. ఇప్పటికి ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ కలుగజేస్తుంది .



ఈ సినిమాలో ఇలియానా ప్లేస్ లో నయనతారను అనుకున్నారట పూరి జగన్నాథ్ . అయితే ఆ టైంలో నయనతార సినిమాలకు సైన్ చేసే విషయంలో క్రేజీ క్రేజీ కండిషన్లు పెడుతూ ఉండేది . ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కి రాను అని..అది ఎంత పెద్ద స్టాల్ హీరోనైనా అంటూ తెగేసి చెప్పేది. అయితే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాని కూడా ఆమె అదే విధంగా కండిషన్ పెట్టిందట.  దీంతో మహేష్ బాబుకి కోపం వచ్చి ఆ హీరోయిన్ వద్దనే వద్దు అంటూ తెగేసి చెప్పారట . ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబోలో ఆగడు సినిమా రావాలి. సరేలేరు నీకెవ్వరు  సినిమాలో కూడా హీరోయిన్గా నయనతారనే అనుకున్నారట.  కానీ మహేష్ బాబునే నయనతార నా సినిమాలో వద్దు అంటూ తెగేసి చెప్పారట . దాదాపు 19 ఏళ్లుగా వీళ్ళు అస్సలు మాట్లాడుకోవడం లేదు.  ఏదైనా ఈవెంట్లో కనిపించిన సరే మహేష్ బాబు - నయనతార చూసి చూడనట్లు ముఖం తిప్పుకొని వెళ్లిపోతారే తప్పిస్తే ఒకరి గురించి ఒకరు ఎక్కడ ఏ సందర్భంలోనూ మాట్లాడుకోలేదు...!

మరింత సమాచారం తెలుసుకోండి: