టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరో చేసిన పని ఇప్పుడు నెట్టింట విమర్శలకు దారి తీస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సినటువంటి సెలబ్రెటీలు కూడా కొన్ని నిబంధనలను సైతం ఉల్లంఘించడంతో చాలామంది తిట్టిపోస్తున్నారు. నిన్నటి రోజున సాయంత్రం టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో ప్రయాణిస్తూ ఉండగా తన కారు తో హల్చల్ చేసినట్లుగా తెలుస్తోంది. రాంగ్ రూట్లో కారు పోనివ్వడమే కాకుండా.. అక్కడ ప్రశ్నించినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడా దురుసుగా ప్రవర్తించారనే విధంగా  ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఏకీపారేస్తున్నారు.



దీంతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ పై అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు  సంబంధించి ఇంకా పూర్తి వివరాలు  తెలియాల్సి ఉన్నది. ప్రముఖ నిర్మాతగా టాలీవుడ్ లో పేరుపొందిన బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటిసారి అల్లుడు శీను సినిమాతో 2014లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ తన నటనతో డాన్స్ తో ఫైట్లతో ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు.


ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు తదితర చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. గతంలో హిందీలో చత్రపతి సినిమాని హీరోగా రీమిక్స్ చేసినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం భైరవం, హైందవ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. భైరవం సినిమా ముగ్గురు మల్టీ స్టార్లర్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు. మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తూ ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరి ఈ చిత్రాలతో నైనా  సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: