
క్యాన్సర్ తో పోరాడుతున్నానని తెలిసిన సమయంలో ఆ విషయం అందరికీ చెప్పాలని నేను అనుకోలేదని ఆమె అన్నారు. ఆ సమయంలో నేను ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నానని ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుండేదని అదే సమయంలో నేను చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఆ సమయంలో నేను మాయమయ్యానని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నా గురించి ఇష్టానుసారం ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని వాటి వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడవచ్చని అన్నారు. అది నాకు ఏ మాత్రం నచ్చదని అందుకే నా హెల్త్ గురించి ధైర్యంగా బయటపెట్టానని సోనాలి బింద్రే వెల్లడించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో లుక్స్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చారు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న సోనాలి క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వాళ్ల జీవితాలు క్యాన్సర్ కు ముందు క్యాన్సర్ తర్వాత అనే విధంగా ఉంటాయని ఆమె తెలిపారు. సోనాలి బింద్రే చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనాలి బింద్రే కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. మంచి పాత్రలకు ఈ నటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సోనాలి బింద్రే రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాలి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.