నిర్మాత ఎస్ కే ఎన్ ఇప్పటికే చాలాసార్లు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన తన సోషల్ మీడియా ద్వారా ఎన్నో వివాదాల మీద స్పందిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఎస్కేఎన్ తాజాగా హీరోయిన్ల బాత్రూంలలోకి యాక్సెస్ ఉండదంటూ మాట్లాడి మళ్ళీ వివాదంలో ఇరుక్కున్నారు. మరి ఇంతకీ ఆ మాటలు ఎందుకు మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అల్లు అరవింద్ సమర్పనలో వచ్చిన #సింగిల్ మూవీ తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా లు హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమా హిట్ కొట్టడంతో పోస్ట్ ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత ఎస్కేఎన్ హీరోయిన్ కేతిక శర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే గతంలో హీరోయిన్ కేతిక శర్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తో కలిసి నటించిన రొమాంటిక్ మూవీ ఈవెంట్లో ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఒక పాట పాడండి అని అడిగారు. అయితే ఆ టైంలో నేను బాత్రూం సింగర్ ని అంటూ కేతిక శర్మ తప్పించుకుంది. అయితే అప్పటి విషయాన్ని మళ్ళీ ఇప్పుడు నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ అప్పట్లో ప్రభాస్ పాట పాడమని అడిగినప్పుడు బాత్రూం సింగర్ అని అన్నారు.ఎలాగూ హీరోయిన్ల బాత్రూంలలోకి రావడానికి మాకు యాక్సెస్ లేదు.కనీసం ఇప్పుడైనా ఒక పాట పాడండి హ్యాపీగా ఫీల్ అవుతాం అంటూ కేతిక శర్మని అడిగారు.

ఇక ఎస్కేఎన్ మాటలకు ఆ పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ మేము హ్యాపీగా ఫీల్ అవ్వడమేమో కానీ మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు అని కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కేతిక శర్మ ఒక సాంగ్ పాడింది. అలాగే కేతిక శర్మ పాడిన పాట చాలా బాగుంది అని నిర్మాత ఎస్కేఎన్  మెచ్చుకున్నారు.అలాగే తనకు అమ్మాయిలతో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది అని కూడా ఎస్కేఎన్ అని చెప్పడంతో ప్రస్తుతం ఎస్కేఎన్ మాట్లాడిన మాటలపై విమర్శలు వస్తున్నాయి.చాలామంది సోషల్ మీడియాలో ఎస్కే ఎన్ ని ఏకిపారేస్తున్నారు . హీరోయిన్ల బాత్రూంలలోకి యాక్సెస్ లేదు అని అంటున్నారు.. ఉంటే వెళ్ళిపోతారా ఏంటి అంటూ ఏకిపారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: