ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అన్నట్లుగా పెళ్లీడుకొచ్చిన సమయంలోనే పెళ్లి చేసుకుంటున్నారు.. అలా తాజాగా మెగా హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ మూవీ లో రామ్ చరణ్ ప్రియురాలుగా నటించిన షాజన్ పదం సి.. ఆరెంజ్ మూవీలో "రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే" అనే పాటతో జెనీలియా కంటే ఎక్కువ ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ పోతినేని, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన మసాలా మూవీలో రామ్ పోతినేని కి జోడిగా నటించింది. 

అలా తెలుగులో నటించినవి రెండే సినిమాలు అయినప్పటికీ ఆరెంజ్ మూవీ ద్వారా మాత్రం ఈ ముద్దుగుమ్మకి మంచి క్రేజ్ లభించింది. ఇక హిందీలో నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది  షాజన్ పదంసీ..అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి పీటలేకబోతున్నట్టు తెలుస్తోంది.ఇక గత ఏడాది నవంబర్ లో తన ప్రియుడు ఆశిష్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక షాజన్ పదం సి చేసుకోబోయే ఆశిష్ ప్రముఖ బిజినెస్ మాన్ అని తెలుస్తోంది.

అలా బిజినెస్ మ్యాన్ తో చాలా రోజులు డేటింగ్ చేసిన షాజన్ పదం సి గత ఏడాది నవంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే తాజాగా షాజన్ పదం సీ ఆశిష్పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. షాజన్ పదం సీ ఆశిష్పెళ్లి ఈ సంవత్సరం జూన్ 5న జరగబోతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే షాజన్ పదం సి ఆశీష్ లు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షాజన్ పదం సీ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు రావడంతో చాలామంది నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: