సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ కేవలం 10 శాతం అనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం విడుదలవుతున్న సినిమాలలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. 2025 సంవత్సరంలో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు కేవలం 8 మాత్రమే అంటే ఇండస్ట్రీ పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది. 92 సినిమాలు విడుదలైతే కేవలం 8 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.
 
2025 సంవత్సరంలో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఏదనే ప్రశ్నకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా తర్వాత సంక్రాంతి హిట్ సినిమాలలో డాకు మహారాజ్ గురించి చెప్పుకోవాలి.
 
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. ఫిబ్రవరి నెలలో విడుదలైన తండేల్ మూవీ సైతం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. మార్చి నెలలో రిలీజైన సినిమాలలో కోర్ట్, మ్యాడ్2 సినిమాలు సక్సెస్ సాధించాయి. మార్చి నెల వరకు బాక్సాఫీస్ వద్ద హిట్ల విషయంలో కొదువ లేదనే చెప్పాలి. ఏప్రిల్ నెలలో మాత్రం విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు.
 
మే నెలలో విడుదలైన సినిమాలలో మే 1వ తేదీన విడుదలైన హిట్3 సినిమా ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. మే నెల రెండో వారంలో విడుదలైన సినిమాలలో సింగిల్, శుభం సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ సినిమాలు నిర్మాతలకు లాభాలను అందించాయి. 2025 సంవత్సరంలో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు ఖాతాలో చేరాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జులై నెలలో క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: