సినిమా ఇండస్ట్రీ లో మాస్ ఈమేజ్ ఉన్న హీరో అయినా , క్లాస్ ఈమేజ్ ఉన్న హీరో అయినా ఒకే రకం కథల్లో ఒకే రకం జోనర్ సినిమాల్లో నటించినట్లయితే ప్రేక్షకులు ఆ హీరో నుండి వచ్చే సినిమాలను పెద్దగా అలరించరు. అందుకు ప్రధాన కారణం ఒకే జోనర్ సినిమాలలో ఒకే హీరో నటించినట్లయితే కొత్త దనం ఏమీ లేనట్టు ప్రేక్షకులు భావించడం జరుగుతుంది. దాని వల్ల ఆ హీరో నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోవు. అందుకే హీరోలకి ఏ ఈమేజ్ ఉన్నా కూడా ఒకటి , రెండు సినిమాల తర్వాత కొత్త జోనర్ సినిమాలలో నటిస్తూ ఉంటారు. అలా నటించడం వల్ల ప్రేక్షకులు ఆ హీరో నుండి కొత్త నటనను చూసే అవకాశం ఉంటుంది.

దాని ద్వారా సినిమాలు కూడా మంచి విజయాలను అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రామ్ ఈ మధ్య కాలంలో వరస పెట్టి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో మాత్రమే హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఆఖరుగా ఈయన నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ ఈ మూడు మూవీ లు కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కాదు. ఈ మూవీ గ్లీమ్స్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

చాలా కాలం తర్వాత రామ్ సరికొత్త జోనర్ మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ గ్లీమ్స్ వీడియోను బట్టి చూస్తే ఈ మూవీ మంచి విజయం సాధించే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: