తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం లవ్ టుడే అనే సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి కోలీవుడ్ , టాలీవుడ్ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రదీప్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడాఅద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే తాజాగా ప్రదీప్ "డ్రాగన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది.

మూవీ తో ప్రదీప్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ప్రదీప్ , మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న డ్యూడ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన సినిమాలు వరుస పెట్టి విజయాలను అందుకుంటు ఉండడంతో ఈయన నటిస్తున్న డ్యూడ్ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దానితో ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కుల విషయంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క తమిళనాడు మరియు కర్ణాటక థియేటర్ హక్కులు ఇప్పటికే అమ్ముడు పోయాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క తమిళనాడు , కర్ణాటక థియేటర్ హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సంస్థ వారు ఈ సినిమాను తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: