టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అస్సలు అందుకోవడం లేదు. ఈయన ఆఖరుగా దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను ఎదుర్కున్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా ఆగడు అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ఆగడు మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... మహేష్ బాబు గారితో దూకుడు లాంటి అద్భుతమైన విజయవంతమైన మూవీ ని రూపొందించిన తర్వాత ఆయనతో మరో సినిమా చేయాలి అనుకున్న సమయంలో నేను ఒక కథను తయారు చేసుకున్నాను. అది సూపర్ గా అనిపించింది. దానిని మహేష్ బాబుకు వినిపిస్తే మహేష్ కూడా సూపర్ గా ఎగ్జిట్ అయ్యాడు. కానీ ఆ సినిమాను చేయాలి అంటే అత్యంత భారీ బడ్జెట్ అవుతుంది.

కానీ అప్పటికే మా ఇద్దరి కాంబోలో సినిమా చేయాల్సిన నిర్మాత కాస్త కష్టాల్లో ఉన్నాడు. దానితో ఆ భారీ బడ్జెట్ అవసరం ఉన్న కథను పక్కన పెట్టి ఆగడు స్క్రిప్ట్ తో సినిమా చేశాం. ఆ సినిమా వర్కౌట్ కాలేదు. మేము బడ్జెట్ ఎక్కువయినా పర్లేదు అని ముందు అనుకున్న స్క్రిప్ట్ తో సినిమా చేసి ఉంటే ఆ మూవీ మంచి విజయం సాధించేది అని శ్రీను వైట్ల తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv