టాలీవుడ్లో సీక్వెల్స్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే పాత సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నవి సీక్వెల్ ప్రకటిస్తూ ఉన్నారు. అలా కుర్రాలను బాగా అలరించిన చిత్రం 7/G బృందావన కాలనీ. ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా మిగిలిపోయింది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004లో ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. ఇందులో హీరోగా రవికృష్ణ నటించిన మొదటి సినిమానే అయినా తన యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు రవికృష్ణ. ఇందులో హీరోయిన్ గా సోనియా అగర్వాల్ కూడా నటించింది.


రవికృష్ణ ,సోనీ అగర్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు మ్యూజిక్ శంకర్ రాజా కూడా అద్భుతంగా అందించారు. గతంలో మొదటి చిత్రానికి  దర్శకత్వం వహించిన సెల్వరాగన్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వర్ధిస్తున్నారు. అయితే ఇందులో హీరోగా రవికృష్ణనే నటిస్తూ ఉండగా హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొంతకాలంగా సస్పెన్స్ గా ఉంచారు. మొదట ఇందులో లవ్ టు డే హీరోయిన్ ఇవానా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ కూడా నటించబోతున్నట్లు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలో పేరుపొందిన ఒక హీరోయిన్ నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


ఇక ఆమె ఎవరో కాదు అనన్వర రాజన్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా మలయాళ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్న రేఖా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఎక్కువగా గ్లామర్ షో చిత్రాలకంటే విభిన్నమైన పాత్రలలోని నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్న అనన్వర రాజన్ 7/G బృందావన కానీ సీక్వెల్లో నటించే అవకాశం అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: