మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె ఇప్పటి కే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది . ప్రియమణి కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుం డా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తం గా గుర్తింపును సంపాదించుకుంది. ప్రియమణికి బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానమాట.

షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రియమణి స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. తన అభిమాన నటుడు అయినటువంటి షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం రావడంతో ప్రియమణి తన అభిమానాన్ని నిరూపించుకునేందుకు ఒక డేరింగ్ డెసిషన్ ను తీసుకుందట. అదేమిటి అనుకుంటున్నారా ..? చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రియమణి స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా షారుక్ పై ఉన్న అభిమానంతోనే ఆ సాంగ్ చేసిందట. ఇలా తనకు షారుక్ ఖాన్ పై ఉన్న అభిమానాన్ని ప్రియమణి నిరూపించుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా మంచి విజయం సాధించడం , అలాగే ప్రియమణి చేసిన ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ప్రియమణికి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ లో కూడా ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా కూడా ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: