తమిళ స్టార్ నటుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం వెట్టయన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రజిని , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే రజిని ఓ టాలీవుడ్ యువ దర్శకుడితో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వివేక్ ఆత్రేయ ఒకరు. ఈయన తన తదుపరి మూవీని కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేక్ , రజనీ కాంత్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు , దానిని కొన్ని రోజుల క్రితమే వివేక్ , రజనీ కాంత్ కు వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో వివేక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అలాగే వివేక్ , రజిని కాంబోలో సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే రజిని , వివేక్ కాంబోలో మూవీ సెట్ అయ్యి ఆ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించినట్లయితే ఆ సినిమాపై ఇటు తెలుగు , అటు తమిళ్ ఇండస్ట్రీలలో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: