ఒక పెళ్లి జరుగుతుంది అంటే ఆ వధువు తరుపు తల్లిదండ్రులు కానీ , వరుడు తరుపు తల్లిదండ్రులు కానీ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా జరిగిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఆనందంగా జరగాలి అనుకున్న పెళ్లిలో సడన్ గా ఏదైనా ట్విస్ట్ వచ్చి పెళ్లి ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే పెళ్లి చేసుకునే వధువు , వరుడుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇకపోతే ఇలాంటి సంఘటన తాజాగా పాల్వంచ గ్రామంలో జరిగింది. అసలు విషయంలోకి వెళితే ... ఓ మహిళ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తుంది. ఆమె కొంత కాలం క్రితం భర్తకు దూరం అయింది.

ఇకపోతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతను కూడా తన భార్యకు దూరం అయ్యాడు. అతనికి భార్య లేదు. దానితో వీరిద్దరికీ పెద్దలు వివాహం కుదిర్చారు. అంతా జరిగిపోయింది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరగబోతుంది అనే సమయంలో ఒక ట్విస్ట్ ఎదురైంది. వేదిక మధ్యకు మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేరుకున్నాడు. పెళ్లి ఆపండి. వధువును నేను ఇష్టపడ్డాను. అంటూ గందరగోళం సృష్టించడం మొదలుపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ యువతికి ప్రస్తుతం 29 సంవత్సరాలు. ఈమెకి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఆమెకు ఒక పాప కూడా ఉంది. కానీ ఆమె కొంత కాలం క్రితం తన భర్తతో మనస్పర్ధల వల్ల విడిపోయింది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. ఖమ్మంలో పని చేసే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడుతో ఈమెకు వివాహాన్ని తల్లిదండ్రులు కుదిర్చారు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి అనగా మరో ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు.

ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నప్పుడు వధువుతో నాకు పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లి అయినా కూడా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లాడుతా అంటూ రభస సృష్టించాడు. ఇక ఈ గందరగోళం పెద్దది కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఇక తన పెళ్లిని కావాలనే ఆగిపోయేలా చేశాడు అని సదరు ఉపాధ్యాయుడు పై వధువు పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: