నాచురల్ స్టార్ నాని ఈ మ ధ్య కాలంలో వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుం టూ వస్తున్నాడు . కొంత కాలం క్రితం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ తో సూపర్ సక్సెస్ను అందుకున్న నాని ఆ తర్వాత శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం , తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. వరుసగా నాలుగు విజయాలను అందుకున్న నాని తన తదుపరి మూవీ ని తనకు ఇప్పటికే దసరా మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేయబోతున్నాడు.

మూవీ కి సంబంధించిన టైటిల్ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఈ మూవీ కి ది ప్యారడైజ్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించడం ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ఏకంగా 18 కోట్ల భారీ ధరకు ఓ ప్రముఖ ఆడియో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఓ క్రేజీ బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిల్ మూవీ లో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ్ జూయల్ ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని మూవీ బృందం మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: