- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమా టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తమిళ బ్లాక్ బస్టర్ గ‌రుడ‌న్‌ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ - మంచు మనోజ్ కూడా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ముగ్గురు కుర్ర క్రేజీ హీరోలు కలిసి మొదటిసారిగా నటిస్తున్న సినిమా ఇది. విజయ్ కనక మెడల  దర్శకత్వంలో కేకే రాధా మోహన్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అదితి శంకర్ - ఆనంది దివ్య - పిళ్లై హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ బ‌స్ క్రియేట్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఫిదా చేసింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - నారా రోహిత్ - మంచు మనోజ్ వరుస ప్రమోషన్లతో సినిమాకు మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. భైవ‌రం సినిమా మే 30న విడుదల అవుతుంది.


పైగా సినిమాపై ఉన్న బ‌జ్ నేప‌థ్యంలో నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ విషయంలో భారీ డీల్ ముగిసింది. జి స్టూడియో ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ను రు. 32 కోట్లకు స్వాధీనం చేసుకున్నారు. ఇది టాలీవుడ్ లో ఒక రికార్డు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీ మార్కెట్లో ఉన్న సాలిడ్ బ‌జ్‌ దీనికి కీలక కారణం. ఈ డీల్ ద్వారా నిర్మాతలు సినిమా పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చుకున్నట్టే. ఈ సినిమా ధియేటర్ రేట్ తో పాటు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్  ద్వారా భారీ రెవెన్యూ తీసుకొస్తోంది. ఏది ఏమైనా భైవ‌రం సినిమాకు రిలీజ్ విషయంలో పోటి సినిమాలో లేకపోవడంతో సినిమాకు హిట్ టాక్ వస్తే బాగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొలగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: