జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తున్న మొదటి మూవీ వార్ 2...హృతిక్ రోషన్ కి విలన్ గా ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో సమాన స్థాయి ఉన్న పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్లు తలపడుతుండటంతో అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ ఇండస్ట్రీ లో ఎంతో ఆసక్తి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వార్ -2 కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ లో ఎన్టీఆర్ కి సంబంధించి కటౌట్ అస్సలు బాలేదని చాలామంది ఎన్టీఆర్ పై ట్రోల్ చేస్తున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ లో  ఓ వర్గం ప్రజలు అయితే ఎన్టీఆర్ పై పగబట్టినట్టే మాట్లాడుతున్నారు.

హృతిక్ రోషన్ లాంటి బాడీ,కటౌట్ ఉన్న హీరోతో వార్ చేయాలి అంటే ఆయనకి సరిపోయే స్థాయిలోనే  ఉండాలి ఎన్టీఆర్ సరిపోడు..సౌత్ లో ప్రభాస్ అయితే హృతిక్ రోషన్ కి విలన్ గా కరెక్ట్ గా సెట్ అయ్యేవాడు.ఇలాంటి వాడిని ఎందుకు తీసుకున్నారు.. హృతిక్ రోషన్ కి సమానంగా కనిపించడం కోసం ఎన్టీఆర్ కి స్టూల్ వాడారు.. కానీ ఆ ప్లేస్ లో ఐస్ ఉన్నట్టు ఎడిటింగ్ చేశారు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ గా అస్సలు బాలేదు. అసలు ఆయనకు హృతిక్ రోషన్ ముందు కటౌట్ సెట్ అవ్వలేదు.

ఇద్దరు సేమ్ హైట్ ఉంటేనే బాగుండేది అంటూ ఎంతోమంది జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ అస్సలు బాలేదని,ట్రోల్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ధీటుగా ఆన్సర్ ఇస్తున్నారు. హైట్ కాదు చూడాల్సింది యాక్టింగ్..యాక్టింగ్ లో మా నందమూరి బిడ్డను కొట్టేవాడే లేడు అంటూ తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2 మూవీ ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: