నందమూరి నట సింహం బాలకృష్ణ కు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంత కాలం వరస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" సినిమా నుండి వరస పెట్టి భారీ విజయాలను అందుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తున్నాడు. ఆఖరుగా బాలయ్య "డాకు మహారాజ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే జైలర్ మూవీ భారీ విజయాన్ని సాధించి ఉండడంతో జైలర్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ , ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పాత్ర నిడివి ఈ సినిమాలో పది నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పది నిమిషాల కోసం బాలకృష్ణ ఏకంగా 22 కోట్ల రూపాయల పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పది నిమిషాల పాత్ర కోసం 22 కోట్ల పారితోషకం అనేది చాలా ఎక్కువే అయినప్పటికీ బాలకృష్ణ కు అద్భుతమైన క్రేజ్ ఉండడం , ఆయన క్రేజ్ వల్ల సినిమాకు కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు ఉండడంతో జైలర్ 2 మూవీ ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ వారు ఇంత పెద్ద మొత్తాన్ని బాలకృష్ణ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: