- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది ? అన్నదానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చేసింది. పెద్ది సినిమా తర్వాత బుచ్చిబాబు గురువు దర్శకుడు సుకుమార్ తో రామ్ చరణ్ 17 సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అందరూ సైలెంట్ గా ఉండటం ప్రాజెక్ట్‌ కాస్త సస్పెన్స్ గా మారింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు పై సుకుమార్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. తన స్వగ్రామం అయిన మ‌ల్కీపురం వెళ్లిన‌ సుకుమార్ అక్కడ తన తర్వాతే సినిమా రామ్ చరణ్ తోనే ఉంటుందని తెలిపారు.


ప్రస్తుతం స్క్రిప్ట్ తో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్టుగా చెప్పిన సుకుమార్ తన తర్వాతి సినిమా చరణ్తోని క్లారిటీ ఇవ్వడంతో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఏదేమైనా సుకుమార్ వ‌రుస గా మెగా హీరోల‌తో సినిమా లు చేసుకుంటూ వెళుతూ వారికి హిట్లు ఇస్తున్నాడు. చ‌ర‌ణ్ త‌ర్వాత సుకుమార్ మ‌ళ్లీ బ‌న్నీ తో పుష్ప 3 తీసే ఛాన్స్ ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: