ప్రముఖ నటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన జాన్వీ కపూర్ తనదైన నటన, అందంతో అనేక సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది. ఈ భామ మొదట హిందీలో ధడక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ తన నటనకు పెద్దగా ప్రశంసలు అందుకోలేదు. అనంతరం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

తెలుగులో దేవర సినిమాతో అభిమానులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న జాన్వి కపూర్ ఆ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఈ చిన్నది పెద్ది సినిమాలోనూ అవకాశాన్ని అందుకుంది. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నటిస్తూనే అనేక సినిమాలలో ఈ చిన్నది అవకాశాలను అందుకుంటుంది. ఇదిలా ఉండగా.... జాన్వి కపూర్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త శిఖర్ పహారియాతో చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంది.

వీరిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరూ చాలా సందర్భాలలో పూజలు నిర్వహించారు. పార్టీలు, ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరి ప్రేమ విషయాన్ని జాన్వి చాలా సందర్భాలలో నేరుగా ఒప్పుకుంది. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే జాన్వికి సంబంధించి ఓ వార్త సంచలనంగా మారుతుంది. జాన్వి వివాహానికి ముందే ప్రెగ్నెంట్ అయినట్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. సినీ పరిశ్రమలో చాలామంది వివాహానికి ముందే ప్రెగ్నెంట్ అవడం, పిల్లలను కనడం లాంటివి చాలా కామన్. ఈ కోవలోకి జాన్వి కపూర్ కూడా చేరిందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ భామకు సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: