సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అలా మొదట ఒకరు చేయాల్సిన సినిమా మిస్ అయ్యి వేరే హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సినిమా మంచి విజయం సాధిస్తే మిస్ అయిన హీరో ఎందుకు ఆ సినిమాను మిస్ అయ్యానా అని ఫీల్ అవ్వడం జరుగుతూ ఉండడం కామన్. అలాగే మొదట అనుకున్న హీరో మిస్ అయిన సినిమాలో మరొక నటుడు నటించి ఆ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ అయినట్లయితే ఆ రోజు ఆ సినిమాను మిస్ చేసి మంచి పని చేశాను అని ఆ నటుడు అనుకోవడం కూడా కామన్.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు అనే విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ తో మొదట ఓ సినిమాను రీమేక్ చేయాలి అని మేకర్స్ అనుకున్నారట. కానీ ఆ మూవీ రీమిక్లో పవన్ నటించకపోగా చిరంజీవి నటించగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇంతకు ఆ రీమిక్ సినిమా ఏది అనుకుంటున్నారా ..? అది తమిళ మూవీ అయినటువంటి వేదాళం. తాజాగా నిర్మాత ఏ ఏం రత్నం మాట్లాడుతూ ... చాలా కాలం క్రితం తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించిన వేదాళం మూవీ ని పవన్ హీరో గా రీమిక్ చేయాలి అనుకున్నాం.

కానీ అది కుదరలేదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇప్పటికే చిరంజీవి "వేదాళం" మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. అలా పవన్ కళ్యాణ్ మిస్ అయిన ఈ రీమేక్ మూవీ లో చిరంజీవి హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: